రమ్య కృష్ణ రియల్ స్టోరీ | Actress Ramya Krishna Facts

461

రమ్యకృష్ణ… అందం అభినయం రాజసం కలగలిపితే తాను. తెలుగుతెర మీద వన్నెతగ్గని అందం ఆమె సొంతం. తెలుగుతెర మీద తనదైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్ర అయినా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయినా సరే నటించి మెప్పించింది. హిట్స్ ప్లాప్స్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను అలరించింది.

రమ్యకృష్ణ సెప్టెంబర్ 15 1967 లో చెన్నైలో జన్మించింది. ఈమె తల్లి పేరు మాయ తండ్రి పేరు కృష్ణ. రమ్యకృష్ణ తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు అందరు అగ్ర హీరోల సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే ఈమె సినీ రంగంలో అడుగుపెట్టిన చాలా కాలం వరకూ సరైన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించింది. యుక్తవయస్సులోనే సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో ‘వెల్లై మనసు’లో ప్రధాన ప్రాత పోషించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘బాల మిత్రులు’ 1987లో విడుదల అయింది.

కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి.నరసింహ చిత్రంలో రజినీకాంత్ తో పోటీపడి మరీ చేసిన ‘నీలాంబరి’ పాత్రను రక్తి కట్టించింది. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లరిమొగుడు, అల్లరి ప్రేమికుడు, ఇద్దరు మిత్రులు, ఆయనకు ఇద్దరు, అల్లుడుగారు, కంటే కూతుర్నే కనాలి, అమ్మోరు, క్రిమినల్, చంద్రలేఖ,అన్నమయ్య, ఆహ్వానం, బాహుబలి లాంటి ఎన్నో అద్భుమైన సినిమాలలో నటించింది. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంది. మొత్తం 200 చిత్రలకు పైగా నటించింది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెద్దలను ఒప్పించి జూన్ 12 2003 న పెళ్ళి చేసుకుంది. రమ్యకృష్ణకు రిత్విక్ అనే కొడుకు ఉన్నాడు. రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ‘జరా మస్తీ జరా ధూమ్’ అనే టీవీ షో ప్రారంభించింది. మరిన్ని రకరకాల టీవీ షోలు చేయలన్ని ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.1998 లో నటించిన కంటే కూతుర్నే కను సినిమాకు బెస్ట్ హీరోయిన్ గా అలాగే 2009లో వచ్చిన నంది ఉత్తమ సహాయనటి – రాజు మహారాజు చిత్రానికి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తల్లిగా అత్తగా చేస్తూ యమ బిజీగా ఉంది.ఈమె ఇలాగె నటించి మన అందరిని అలరించాలని కోరుకుందాం. మరి రమ్యకృష్ణ గురించి ఆమె కెరీర్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.