కొత్త సంవత్సరం మొదటి రోజే నాగార్జునకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన వర్మ

602

‘శివ’తో తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సైకిల్ చైన్ తెంపడం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఆ తరవాత అలాంటి విజయాన్ని వర్మ ఇప్పటి వరకు అందుకోలేదు. ఎప్పుడూ వివాదాలతో బిజీగా ఉండే వర్మ..

కావాలంటే ఈ వీడియో చూడండి

ఇప్పుడు మళ్లీ తన తొలి హీరోతో సినిమా మొదలుపెడుతున్నారు. నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నేటి (నవంబర్ 20) నుంచి మొదలైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా షూటింగ్‌ను ఘనంగా ప్రారంభించారు.

సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా అక్కినేని నాగార్జున తన కొత్త సినిమా ఫొటో షూట్ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. వర్మ సినిమాలో తన లుక్ ఎలా ఉండబోతోందో తెలుపుతూ కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

‘28 ఏళ్ల క్రితం శివ అనే సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు మళ్లీ ఇంకో చిత్రం. కానీ ఇప్పుడు దీని గురించి నేను మాటల్లో చెప్పలేను. రోజూ జీవితం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతుందని మాత్రం చెప్పగలను’ అని నాగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక నాగార్జున లుక్ విషయానికి వస్తే.. బ్లాక్ టీ షర్ట్‌లో గన్ పట్టుకుని అద్భుతంగా ఉంది.

మరోవైపు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. బల్లపై పోలీస్ టోపీ, గన్, టీ గ్లాస్‌తో రాంగోపాల్ వర్మ స్టైల్లోనే పోస్టర్ ఉంది.

ఆర్జీవీ కంపెనీ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ్, వర్మ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది. గతంలో ‘శివ’, ‘గోవిందా గోవింద’, ‘అంతం’ సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి.