బ‌య‌ట‌ప‌డ్డ ర‌మ్య‌కృష్ణ అస‌లు నిజ‌స్వ‌రూపం

481

సినిమాల్లో కథనాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించిన మేటి నటి రమ్యకృష్ణ. ఆమె తెలుగు త‌మిళంలో స్టార్ హీరోల స‌ర‌స‌న సూప‌ర్ స‌క్సెస్ సినిమాల్లో న‌టించారు. శివగామిగా (బాహుబలి), నీలాంబరి గా(నరసింహాలో) పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా తమిళంలో విడుదలవుతోన్న ఓ సినిమాలో రమ్యకృష్ణ పోషిస్తున్న పాత్ర హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిత్రంలో ఆమె పోర్న్ స్టార్‌గా నటిస్తుండటమే అందుకు కార‌ణం.

Image result for ramya krishna

త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సూపర్ డీలక్స్… విజయ్ సేతుపతి, సమంత ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో రమ్యకృష్ణ పాత్రను చూసి అభిమానులు షాకయ్యారు. శివగామి లాంటి పవర్‌ఫుల్ పాత్ర తర్వాత ఆమె శృంగార తారగా నటించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ సినిమాలో తన పాత్ర గురించి రమ్యకృష్ణ స్పందించారు. అలాంటి పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించారు.

Image result for ramya krishna

‘కొన్ని పాత్రలను డబ్బు కోసం చేస్తాం. మరికొన్నింటినీ పేరు కోసం, పాపులారిటీ కోసం చేస్తాం. ఇంకొన్నింటినీ అభిరుచితో చేస్తాం. ఈ పాత్రను అభిరుచితోనే చేశా’ అని రమ్యకృష్ణ అన్నారు. దీంతో పాటు సినిమాకు సంబంధించి ఆసక్తికర వివరాలు తెలియారు. సూపర్‌ డీలక్స్‌ సినిమాలో కథదే ప్రధాన పాత్ర అని రమ్యకృష్ణ తెలిపారు. నటీనటుల కంటే కంటెంట్‌కే ప్రధాన పాత్ర ఉంటుందని చెప్పారు. దర్శకుడు కుమారరాజా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చాలా బాగా తెరకెక్కించారన్నారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలు ఓ ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తు అని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ క్రింది వీడియో చూడండి 

సినిమాలో నటించిన ఓ సన్నివేశం గురించి రమ్యకృష్ణ ఆసక్తికర వివరాలు చెప్పారు. ఓ సన్నివేశానికి ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నట్లు తెలిపారు. దాన్ని పూర్తి చేయడానికి రెండు రోజులు పట్టినట్లు వివరించారు. అది చూసి తన అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్నవారు షాకైనట్లు ఆమె గుర్తుచేశారు.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 150 టేక్స్ వరకు తీసుకున్నట్లు దర్శకుడు త్యాగరాజన్ చెప్పారు. రమ్యకృష్ణ పోషించిన పాత్ర కోసం తొలుత నటి నదియాను సంప్రదించినట్లు తెలిపారు….రమ్యకృష్ణ నటనకు ప్రాణమిస్తారు. ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతం’ అని త్యాగరాజన్ అన్నారు…సూపర్ డీలక్స్ సినిమాలో విజయ్‌ సేతుపతి స్వలింగ సంపర్కుడి పాత్ర పోషించారు. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. మ‌రి ఈసినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.