ప్రణయ్ హత్య మీద స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ఏమన్నాడంటే?

443

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్టాలలో కలకలం స్పృష్టించిన ఘటన మిర్యాలగూడ ప్రేమికుల ఘటన.కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేయూసుకున్నదని అల్లుడిని చంపించాడు మారుతీరావు.ఈ కేసును పోలీసులు చాలా తొందరగా పరిష్కరించారు.నేరస్థులు అందరు దొరికారు.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుపై ఇదివరకే టాలీవుడ్ ప్రముఖులు పలువురు స్పందించారు. ప్రణయ్ హత్యను తప్పిదమని అభిప్రాయపడిన సెలబ్రిటీలు.. కులాల మధ్య అంతరాలు పెంచకూడదని సలహాలు ఇచ్చారు. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ ‘పరువు హత్య’ ఉదంతంపై తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు.మరి ఆయన ఏమన్నాడో చూద్దామా.

Image result for pranay and amrutha

మిర్యాలగూడ పరువు హత్య ఘటన మీద సామాన్య ప్రజలే కాదు.సెలెబ్రిటీలు స్పందించారు.రామ్ చరణ్,మంచు మనోజ్,రామ్ లాంటి లాంటి సినీ ప్రముఖులు ఈ విషయం మీద స్పందించారు.ఇది చాలా దారుణమైన ఘటన అని ఈ కాలంలో కులం ఏమిటి అని ఈ హీరోలు చెప్పారు.వీరి స్పందన మీద చాలా మంది రియాక్ట్ అయ్యారు.అలాగే ఎప్పుడు వివాదాలతో మీడియాలో ఉండే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం మీద స్పందించాడు.ఆయన ఈ విషయం మీద స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు.ఆయన చేసిన ట్వీట్ లో ఏముందంటే.. ..‘అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు పిరికితనంతో కూడిన చెత్త నేరస్తుడు. తన పరువు కోసం పాకులాడుతూ ప్రణయ్‌ను హత్య చేయించడంతో నేరస్తుడు అయ్యాడు.

ఒకవేళ ఆయన చేయించింది పరువు హత్య అయితే, చనిపోయేందుకు అతడు సిద్ధంగా ఉండాలి. పరువు పేరుతో హత్య చేసిన వారిని చంపేయడమే అసలైన పరువు హత్య’ అని వర్మ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.విన్నారుగా మిర్యాలగూడ పరువు హత్య మీద రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడో.rgv చెప్పింది కూడా నిజమే కదా.పరువు కోసం హత్యలను చేసే వాళ్ళను నిర్ధాక్షిణంగా చంపేయడమే కరెక్ట్ కదా.ఇలాంటి వారికి కఠిన శిక్షలు వేస్తేనే మళ్ళి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం.మరి మీ అభిప్రాయమేమిటి.వరుసగా జరుగుతున్న పరువుహత్యల గురించి అలాగే మిర్యాలగూడ ఘటన మీద రామ్ గోపాల్ వర్మ స్పందించి చేసిన ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.