పవన్ కళ్యాణ్ బర్త్ డేకి రామ్ చరణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్…

339

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా అభిమానులకు ఇంతవరకు టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ గానీ విడుదల చెయ్యలేదు. బోయపాటి, చరణ్ తొలి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.

Related image

బోయపాటి, చరణ్ సినిమా ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ రోజు సైరా టీజర్ తో మెగాస్టార్ సందడి చేయడంతో చరణ్ తన సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించలేదు. దీనితో ఫాన్స్ కు కొంత నిరాశ తప్పలేదు.ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

పవన్ బర్త్ డేకి సర్‌ప్రైజ్

తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదిన చిత్ర ఫస్ట్ లుక్ లేదా టైటిల్ విడుదల చేసే ఆలోచనలో చరణ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మొన్న చిరు పుట్టినరోజున సైరా టీజర్ విడుదల చేశారు.ఆ టీజర్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది.ఇప్పుడు చరణ్ టీజర్ కూడా వస్తదని తెలియడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు.దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.