#RRR లో తన పాత్రను రివీల్ చేసిన రామ్ చరణ్

224

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related image

ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చెయ్యనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ పలు కథనాలు వెలువడినాయి కానీ.. చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎటువంటి సమాచారం అఫీషియల్‌గా రాలేదు.

Related image

అయితే తాజాగా చరణ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోందో మీడియాకు చెప్పేశాడు. ఈ సినిమాలో మళ్లీ డీ గ్లామరైజ్‌డ్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలిపాడు.‘‘రాజమౌళిగారు మళ్లీ డీ గ్లామరైజ్‌డ్ పాత్రను సృష్టించారు. ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఈ సినిమాకే కేటాయించాను. అందుకే మరో సినిమా అంగీకరించలేదు..’’ అని చరణ్ తెలిపాడు.