రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఆ డైరెక్ట‌ర్ తో ఫిక్స్

389

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు….ఇక ఈ సినిమా త‌ర్వాత ఆర్. ఆర్. ఆర్. కాంబినేష‌న్ లో సినిమా చేయ‌నున్నారు. ఎన్టీఆర్ తో క‌లిసి చ‌ర‌ణ్ ఈ సినిమాలో న‌టించ‌నున్నారు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది… ఇప్ప‌టికే ఈ సినిమా డేట్లు కూడా ఎడ్జిస్ట్ చేశాడు రామ్ చ‌ర‌ణ్.. ఐతే చ‌ర‌ణ్ గురించి తాజాగా ఓ న్యూస్ వైర‌ల్ అవుతోంది.

Related image

రామ్ చ‌ర‌ణ్ తాజాగా తాను గ‌తంలో న‌టించిన ఎవ‌డు చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రం చేయ‌బోతున్నార‌ట‌.. ఇక ఈ సినిమా ఆర్ .ఆర్. ఆర్. పూర్తి అయిన త‌ర్వాత మొద‌లు పెట్ట‌నున్నారు అని తెలుస్తోంది.. ఈ సినిమాకు సంబంధించి క్రూ మాత్రం ఇంకా తెలియ‌లేదు.. ఈలోపు వంశీ కూడా త‌న ప్రాజెక్ట్స్ ని ఫైన‌ల్ చేసుకుని ఈ క‌థ‌పై వ‌ర్క్ చేస్తారు అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.. ఇక ఆర్ .ఆర్. ఆర్. సినిమా పూర్తి అవ్వ‌డానికి మ‌రో సంవ‌త్స‌రం ప‌డుతుంది… ఈ సంవ‌త్స‌రం త‌ర్వాత ఈ కొత్త సినిమా ప్రారంభిస్తారు అని తెలుస్తోంది..