మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న చరణ్…

413

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తరువాత మాస్ లో ఎంతో పేరు ఉన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు.కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ నటుడు ప్రశాంత్‌, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌‌లో డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా మూవీ ఫస్ట్ లుక్‌, టైటిల్‌ అనౌన్స్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం.

అలాగే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీ ‘సైరా’ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుంది.మరీ ఈ తండ్రి కొడుకుల సినిమాలలో ఏది మంచి విజయం సాదిస్తుందో చూడాలి.