రామ్ చరణ్ కోసం వినూత్న కార్యక్రమానికి పూనుకున్న మెగా ఫాన్స్..

274

సినీ నటులకు అభిమానులే గొప్పవరం.అభిమానులు లేకుంటే హీరో ఎందుకు పనికిరాడు. తమ అభిమాన నటుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు ఫ్యాన్స్. అభిమాన నటుడి కొత్త సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో బ్యానర్స్ కట్టటం, పూల మాలలతో పోస్టర్స్ అలంకరించటం చేస్తుంటారు.సినిమా ప్లాప్ అయినా సరే మంచి కలెక్షన్స్ సాధించేలా అభిమానులు చేస్తుంటారు.

Related image

అయితే ఇప్పుడు మెగా అభిమానులు ఎన్నడూ లేని విధంగా కొత్త రూటులో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో వినయవిధేయ రామ సినిమా చేస్తున్నాడు.కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలనుకున్నారో ఏమో గానీ వినూత్న రీతిలో బైక్ ర్యాలీ చేసి సినిమా ప్రచారం చేపట్టబోతున్నారు.

బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న వినయ విధేయ రాముడైన రామ్ చరణ్ కోసం అఖిల భారత చిరంజీవి యువత, కడప జిల్లా చిరంజీవి యువత కలిసి డిసెంబర్ 6వ తేదీన బైక్ ర్యాలీ చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.