బోయపాటి రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్ విడుదల

265

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Image result for వినయ విధేయ రామ

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది.నేడు మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఉండబోతుందని ఒక్కరోజు ముందుగా ప్రకటించిన చిత్ర యూనిట్.. అనుకున్నట్టుగానే బోయపాటి కాంబోలో రామ్ చరణ్ 12వ మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్‌ లుక్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

ram charan rc12 named as vinaya vidheya rama movie first look is out

బోయపాటి అంటే మాస్ యాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్.. ఆయన మార్క్ కనిపించే విధంగా రామ్ చరణ్‌ను మెగా మాస్ లుక్‌లో చూపించారు.రామ్ చరణ్ ను పూర్తి స్థాయిలో చేంజ్ చేసి తనదైన శైలిలో కత్తి పట్టించి పరుగు పెట్టిస్తున్నారు.ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న టైటిల్ ‘వినయ విధేయ రామ’ ను కన్ఫామ్ చేశారు.ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మెగా అభిమానుకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చేదిగా ఉంది ఈ ఫస్ట్ లుక్.