ఆ దేశంలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు సినిమాగా రాంచరణ్ బోయపాటి సినిమా…

385

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు.చరణ్, బోయపాటి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజగా ఈ చిత్ర షూటింగ్ గురించి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

Related image

అదేమిటి అంటే.. యూరప్ లోని పలు దేశాల్లో తెలుగు చిత్రాల షూటింగ్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అజర్బైజాన్ దేశంలో షూటింగ్ జరుపుకున్న చిత్రం గురించి మనం ఇంతవరకు వినలేదు. ఈ దేశంలో షూటింగ్ జరుపుకోబోతన్న తొలి తెలుగు చిత్రంగా రాంచరణ్ సినిమా నిలవబోతోంది.

Related image

అద్భుతమైన లొకేషన్లకు అజర్బైజాన్ పెట్టింది పేరు. కాస్పియన్ సముద్ర తీర అందాలు చూడటానికి చాలా బాగుంటాయి.30 రోజులపాటు అంటే సాంగ్స్ తో పాటు కీలమైన సన్నివేశాలు కూడా అక్కడ చిత్రీకరించనున్నారు.ఇప్పటికి ఈ చిత్రానికి ఇంకా ఎలాంటి పేరు నిర్ణయించలేదు.