మెగా ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త….రేపే రామ్ చరణ్ బోయపాటి సినిమా ఫస్ట్‌లుక్

278

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Related image

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. మంగళవారం(నవంబర్ 6న) మధ్యాహ్నం ఒంటి గంటకు ‘RC12’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ప్రకటించింది.

అంతేకాదు, నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. నవంబర్ 9న ఉదయం 10:25 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నారు.‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బహుశా రేపు ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమా టైటిల్ కూడా తెలిసిపోవచ్చు