ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ పాత్ర రివీల్ అయింది

490

టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి చ‌ర్చ‌జ‌రుగుతోంది.. ఈ సినిమాలో పాత్ర‌ల్లో ఎవ‌రు ఎవ‌రు న‌టిస్తున్నారు అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు చిత్ర యూనిట్ . ఇంకా ప‌లు పాత్ర‌ల‌కు ప‌లువురి పేర్లు బ‌య‌టకు వినిపిస్తున్నాయి…. ఇక వీరి పాత్ర‌ల విష‌యంలో న‌టుడు హీరో నంద‌మూరి బాల‌య్య ద‌ర్శ‌కుడు క్రిష్ క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకున్నారు అని తెలుస్తోంది.

Image result for rakul preet singhబాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు… జూలై 5 నుంచి షూటింగ్ మొదలైంది.. ఇక ఈ సినిమాలో ర‌కుల్ ప్రీతిసింగ్ కూడా న‌టిస్తోంద‌ట‌… అయితే ఎన్టీఆర్ తో ఆ నాడు న‌టించిన సీనియ‌ర్ యాక్ట‌రీస్ పాత్ర‌లు కొన్ని ఇప్పుడు చూపించ‌నున్నారు.. అందులో భాగంగా శ్రీదేవి పాత్ర‌కు ర‌కుల్ ని తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Image result for rakul preet singh

అలాగే మహానటి సావిత్రి పాత్రలో మరోసారి కీర్తి సురేష్ కనిపించనుంది. నందమూరి తారకరామారావుగారి పక్కన మహానటి సావిత్రి, శ్రీదేవి చాలా సినిమాల్లో కలిసి నటించారు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో వారి ప్రస్తావన ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మ‌రి శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ఎలా న‌టిస్తుందో చూడాలి.