రామ్ చరణ్ కు నో చెప్పిన రకుల్…

263

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కైరా అడ్వాణీ కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.వివేక్‌ ఒబెరాయ్‌తో పాటు ప్రశాంత్‌, స్నేహ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Related image

‘వినయ విధేయ రామ’ అనే పేరు ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే దేవి స్టైల్లో ఓ ఐటెంసాంగ్‌ను కూడా కంపోజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకగీతంలో రకుల్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్‌ భావించిందట.

Rakul Preet Says No To Ram Charan And Boyapati New Movie Item Song - Sakshi

కానీ రకుల్‌ మాత్రం కూల్‌గా నో చెప్పేసిందని టాక్‌. తెలుగులో అవకాశాలు లేక కోలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ తిరుగుతున్న రకుల్‌.. ఈ ఐటమ్‌సాంగ్‌ను వద్దనడంతో ఈ పాటకు ఓ బాలీవుడ్‌ భామను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.