రకుల్‌ సాహసం ..మెడతో 40 కిలోల బరువు

337

రకుల్ గురించి మనకు చాలా తెలుసు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లలో రకుల్ ఒకరు.రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ క్వీన్‌ అన్న సంగతి అందిరికీ తెలిసిందే.ఆమెకు హైదరాబాద్ లో రెండు జిమ్ లు కూడా ఉన్నాయి.రకుల్ తాను చేసే జిమ్ వర్కౌట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫిట్ నెస్ గా ఉండాలని అందరికి తెలియజేస్తుంది.

Related image

తాజాగా జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు రకుల్‌. 40 కిలోల బరువును నడుముకు కట్టుకుని పైకి ఎత్తుతున్నట్లు ఆ వీడియోలో కనిపించారామె. ‘‘రెండు రోజులుగా మెడ నొప్పిగా ఉంది. ఇలా చేయడం వల్ల ఆ నొప్పి కాస్త తగ్గుతుంది. అందుకే 40 కిలోల బరువుతో స్వ్కాట్స్‌ చేశా’’ అని తను పోస్ట్‌ చేసిన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

ఐరన్‌ రాడ్‌లపై నిల్చుని రకుల్‌ చేసిన కసరత్తులను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.దీని నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.నువ్వు ఫిట్‌గానే ఉన్నావ్‌ కదా.. ఇలాంటి కసరత్తులు ఎందుకు? అని కామెంట్స్ చేస్తున్నారు.