‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో మరో స్టార్ హీరోయన్ రకుల్ ప్రీతీ సింగ్..ఏ పాత్ర చేస్తుందో చూడండి..

524

తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్..ఆ పేరు వింటే చాలు ప్రతి తెలుగువాడి చాతీ పైకి లేస్తుంది.ఎన్టీఆర్ మా తెలుగువాడు అని గర్వంగా చెప్పుకుంటారు.అయితే ఇప్పుడు ఈయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తయారవుతుంది అని మన అందరికి తెలిసినదే.అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

rakul preet singh item song in ntr biopic..?

క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవల మొదలైంది.అయితే ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది అగ్ర నటులు నటిస్తున్నారు.అయితే టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలోకి మరో స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఇప్పటికే ఈ చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ కూడా చేరింది.

సినిమాలోని కీలక సన్నివేశంలో రానున్న పాట కోసం చిత్ర యూనిట్ రకుల్‌ప్రీత్ సింగ్‌ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.రకుల్ ప్రీతీ సింగ్ ఎన్టీఆర్ బయోపిక్ లో ఐటం సాంగ్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి.సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్టీఆర్‌ సినిమాల్లోని చాలా ఐటెమ్‌ సాంగ్స్ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో ఏ పాటని రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ఈ సినిమాలో కేటాయించారో చిత్రం విడుదల వరకూ సస్పెన్స్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. స్టార్స్‌‌ చేరికతో ఎన్టీఆర్‌ సినిమా‌పై అంచనాలు పెరిగిపోతుండగా.. చిత్ర యూనిట్ ఆశించిన దానికంటే ఎక్కువగానే ప్రచారం లభిస్తోంది.