మరొకసారి మహేష్ సరసన ఛాన్స్ దక్కించుకున్న రకుల్?

307

రకుల్ ప్రీత్ సింగ్ గురించి మన అందరికి తెలిసిందే.టాలీవుడ్ లో ఉన్న హాటెస్ట్ బ్యూటీలలో ఆమె ఒకరు.అందరు స్టార్ హీరోల సరసన నటించింది.ప్రస్తుతం ఆచీతూచీ సినిమాలను ఎంచుకుంటుంది.తమిళ్ ఇండస్ట్రీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుండడంతో తెలుగు సినిమాలను కొంచెం తగ్గించింది.అయితే ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

Related image

మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని మన అందరికి తెలిసిందే.గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు జోడిగా రకుల్ ను తీసుకుంటున్నాడట సుకుమార్.స్పైడర్ సినిమాలో మహేశ్‌బాబుతో జతకట్టిన రకుల్.. మరోసారి ఆయనతో కలిసి నటించనుందట.

Related image

స్పైడర్‌ చిత్రం ఆశించిన మేర విజయం సాధించనప్పటికీ మహేశ్, రకుల్ జంటకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వీరిద్దరు మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకతంలో మహేశ్ ‘ వన్..నేనొక్కడినే’ చిత్రంలో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయినా నటుడిగా మహేశ్‌ను కొత్తకోణంలో చూపించింది.అలాగే సుకుమార్ దర్శకత్వంలో రకుల్ నాన్నకు ప్రేమతోలో నటించింది.