మహేష్‌కు జోడిగా మరో ఛాన్స్‌ కొట్టేసిన రకుల్..

415

టాలీవుడ్ లో రకుల్ ప్రీతీ సింగ్ హావ నడుస్తుంది.పెద్ద పెద్ద సినిమాల్లో రకుల్ నే ఎంచుకుంటున్నారు.ఇప్పటికే అందరి పెద్ద హీరోల పక్కన నటించినది ఈ బ్యూటీ.అయితే ఇప్పుడు మరొకసారి వాళ్ళతో జతకట్టడానికి సిద్దమవుతుంది.మహేష్ బాబుతో రకుల్ స్పైడర్ అనే సినిమా చేశాడు.ఇప్పుడు మరొక సినిమా చెయ్యడానికి రెడీ అయ్యింది.

 

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే 25వ సినిమా షూటింగ్ జరుగుతుండగానే నెక్ట్స్ చేయబోయే సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు ఓకె చెప్పాడు.

రంగస్థలం సక్సెస్‌ తో సూపర్‌ ఫాంలో ఉన్న సుకుమార్, మహేష్ కోసం ఆసక్తికర కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న మహేష్ 25 పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది.స్పైడర్ అనుకున్నంత విజయం సాదించలేదు.అయితే స్పైడర్‌ షూటింగ్ సమయంలోనే రకుల్ మరో ఛాన్స్‌ ఇస్తానని మహేష్‌ మాట ఇచ్చాడట. ఇచ్చిన మాట ప్రకారం సుకుమార్‌ సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.