రష్మికను బతకనివ్వండి..మీరు అనుకున్నది ఏది జరగలేదు.. బ్రేకప్‌పై రక్షిత్ భావోద్వేగ లేఖ

347

కన్నడ తారలు రష్మిక మందన్న, రక్షిత్ నిశ్చితార్థం రద్దుపై క్లారిటీ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల వారికి చెందిన ఇరు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు.అయితే రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్ అయినా విషయం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మికపై వస్తున్న రూమర్లకు చెక్ చెబుతూ ఆమెకు రక్షిత్ అండగా నిలుస్తూ బ్రేక్ వార్తలను ధృవీకరిస్తూ ఉద్వేగభరితమైన లేఖను ఫేష్‌బుక్‌లో పోస్టు చేశారు.

మీడియాను వార్తలను నమ్మకండి

నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ముందుగా ప్రకటించాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వివరణ ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ను ఎంచుకొన్నాను. నిశ్చితార్థం క్యాన్సిల్ కావడంతో గత కొద్దిరోజులుగా జీవితంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి..ఎవరి ప్రేమకోసమైతే తపించానో, ఎవరి కోసమైతే బతికానో వారు దూరమైనప్పుడు ఎంత బాధ ఉంటుదో మాటల్లో చెప్పలేం. ఈ వ్యవహారంలో రష్మిక గురించి తప్పుడు అభిప్రాయాలను ఏర్పరుచుకోవద్దు. బయట మాట్లాడుకొంటున్న తీరును నేను తప్పు పట్టాలనే ఉద్దేశం లేదు. మేము చెప్పేది, మాకు తెలిసింది మీరు కూడా నమ్మాలని కోరుకొంటున్నాం.రష్మికతో బ్రేకప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏదో కారణాన్ని ఊహించుకొని రష్మికపై ఓ అభిప్రాయానికి రావొద్దు. ఆమె ప్రశాంతంగా బ్రతకనివ్వండి. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. నిజమేంటో తెలుస్తుంది.

ఎవరి ప్రేమకైతో పరితపించానో

రష్మిక, నా బ్రేకప్ వ్యవహారంలో మీడియా ప్రసారం చేసే కథనాలను, లేదా వార్తలను నమ్మకండి. ఈ వ్యవహారంలో చోటుచేసుకొన్న అసలు విషయాలు ఎవరికి తెలియవు. కొన్ని మీడియా సంస్థలు వారికి తోచింది ఏదో ఊహించుకొని ఏదో ఏదో రాసేస్తున్నాయి. కల్పిత వార్తలు వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఉండవు.నా బాధ, ఈ విషయం అందరికీ అర్ధం కావడానికి నా ఫేస్‌బుక్ అకౌంట్‌ను మరికొన్ని రోజులు లైవ్‌లో ఉంచుతాను. వాస్తవం చెప్పాల్సిన ప్రతీసారి నేను సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తాను. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి, బ్రేకప్‌కు సంబంధం లేదని రక్షిత్ తెలిపారు.కాబట్టి ఇక మీద అయినా రకరకాల ఊహాగానాలు స్పృష్టించడం మానేస్తారని కోరుకుందాం.