యాంకర్ సుమ రెమ్యూనరేషన్ ఎంత? రాజీవ్ కనకాల చెప్పింది నిజమా?

394

క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే. అలాగే టీవీ ఇండ‌స్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. ఒక‌టి రెండు కాదు.. రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్ రంగాన్ని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తుంది సుమ‌. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి.. గ్లామ‌ర్ షోలు కూడా చేస్తున్న ఈ స‌మ‌యంలో ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విష‌యం కాదు. కానీ సుమ మాత్రం చేసి చూపించింది.

Image result for anchor suma

పైగా తెలుగమ్మాయి కూడా కాదు.. ఎక్క‌డో కేర‌ళ నుంచి ఇక్క‌డికి వ‌చ్చి తెలుగు తెలుగ‌మ్మాయిల కంటే స్ప‌ష్టంగా మాట్లాడుతుంది సుమ క‌న‌కాల‌. అయితే సుమ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. ఈమె హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది.. ఎప్పుడు చూడూ షోస్ చేస్తూనే ఉంటుంది.. ఆమె రెమ్యున‌రేష‌న్ ల‌క్ష‌ల్లో.. సంపాద‌న కోట్ల‌లో ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తుంటాయి. ఒక మలయాళీ అమ్మాయి తెలుగు ఇంస్ట్రీలో అనర్గళంగా ఇక్కడి భాష మాట్లాడుతూ ఈ స్థాయిలో ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. సుమ విజయం వెనక భర్త రాజీవ్ కనకాల సపోర్ట్ ఉందని అంతా అనుకుంటారు. అయితే రాజీవ్ కనకాల మాత్రం ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Image result for anchor suma

సుమ ప్రతిభ, పనితనమే ఆవిడను అక్కడ కూర్చోబెట్టింది. అందులో క్రెడిట్ ఏ మాత్రం నేను తీసుకోను. అయితే ఆమె దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కోడలు కావడంతో తెలియకుండా ఆమెకు కాస్త హెల్ప్ అయిఉండొచ్చు. మిగతాది అంతా ఆవిడ ప్రతిభ మాత్రమే అని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. సుమ టెలివజన్ రంగంలో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె రెమ్యూనరేషన్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు హీరో హీరోయిన్లను మించి సుమ రెమ్యూనరేషన్ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ప్రచారాన్ని రాజీవ్ కనకాల తోసి పుచ్చారు. సుమ వరుస షోలు, కార్యక్రమాల్లో కనిపిస్తుంది కాబట్టి అంతా అలా అనుకుంటున్నారు. కానీ దీని వెనక కష్టం కూడా అలాగే ఉంటుందని తెలిపారు.

Image result for anchor suma

మధ్యలో ఐదు నిమిషాలు నిల్చొని ఒక షాట్ చేయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది రోజుకు కొన్ని వందల లైట్ల మధ్య రెండు మూడు గంటలు నిలబడి ప్రోగ్రాం చేయడం అంటే ఇంకా కష్టం. అలా రోజుకు ఎనిమిది తొమ్మిది గంటలు నిల్చొని షో చేయడం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోజూ మీరు స్పీకర్లు ఆన్ చేసేకుని కూర్చుంటే మీకు తెలియకుండానే మొదడు మీద ప్రభావం పడుతుంది. ఆ పెయిన్ భరిస్తూ చాలా కష్టపడి ఇన్నేళ్ల నుంచి సుమ చేసుకుంటూ వస్తోంది. అయితే బయట అంతా అనుకుంటున్నట్లు ఓహో అనేంత రెమ్యూనరేషన్ అయితే ఉండదని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

సుమ ఒక ఆడియో ఫంక్షన్‌కు తీసుకునే రెమ్యూనరేషన్ కొన్ని లక్షల్లో ఉంటుందని అంటుంటారు అయితే ఎన్ని లక్షల్లో నాకైతే తెలియదని రాజవ్ కనకాల తెలిపారు. సుమ ఎంత సంపాదిస్తోంది? ఏమిటి? లాంటి విషయాలను ఎప్పుడూ తెలుసుకోలేదు, అలాంటి ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఆవిడ స్పేస్ లోకి నేను వెళ్లి నీ సంపాదన మీద నేను పెత్తందారి చలాయిస్తాను అనే నేచర్ నాది కాదు. తన రెమ్యూనరేషన్ ఏమిటో నిజంగా నాకు తెలియదన్నారు. యాంకర్ సుమ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..