రామ్ చరణ్ ఎన్టీఆర్ ల మధ్య యాక్షన్ సీక్వెన్స్‌తో ‘RRR’ షూటింగ్ ప్రారంభం

274

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ర‌మా రాజ‌మౌళి, ఎడిట‌ర్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ విజ‌న్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాబు సిరిల్‌, సినిమాటోగ్ర‌ఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌, క‌థ‌: వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

Image result for rrr movie launch

ఈ చిత్రాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, నందమూరి కళ్యాణ్‌రామ్ సహా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దర్శకులు వి.వి.వినాయక్, కొరటాల శివ, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి తొలి క్టాప్‌ను ఇచ్చి చిత్ర షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కె.రాఘవేంద్రరావు స్క్రిప్టును దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్యకు అందజేశారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుంచి ప్రారంభమవుతుందని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. షూటింగ్ ప్రారంభంలో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో యాక్షన్ సీక్సెన్స్‌ను చిత్రీకరిస్తామని తెలిపింది.