#RRR ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ ఫిక్స్ చేసిన రాజమౌళి

391

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో త్వరలో #ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ డార్జిలింగ్‌లో ప్లాన్ చేస్తున్నారట. అక్కడ సినిమా షూటింగ్ కోసం ప్రభుత్వ అనుమతి కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు డీవీవీ దానయ్య ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా కాన్సెప్టు ఏమిటి? అనే విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.మరి ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో గానీ అటు మెగా ఇటు నందమూరి అభిమానులకు పండుగే అని చెప్పుకోవాలి.