#RRR కు 4డి మ్యాజిక్‌ ను సిద్ధం చేసిన జక్కన్న…

258

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.

Image result for #rrr

రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ను తారక్‌, చరణ్‌లపై పోరాట సన్నివేశాలతో ప్రారంభించారు. అయితే ఈ పోరాట ఘట్టాలకు జక్కన్న 4డి టెక్నాలజీ జోడించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. తారక్‌, చరణ్‌ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సన్నివేశాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Related image

అంతేకాదు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమాకు వాడిన సాంకేతిక పరిజ్ఞానం కంటే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కు వాడే టెక్నాలజీ ఎఫెక్ట్సే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని ఫిలిం వర్గాల సమాచారం. కేవలం ఈ పోరాట ఘట్టాలను చిత్రీకరించడానికే 120 కెమెరాలను ఉపయోగిస్తున్నారట. ఫైట్‌ చేస్తున్నప్పుడు తారక్‌, చరణ్‌ల హావభావాలు, ముఖకవళికలు అన్నీ 4డి టెక్నాలజీతో క్యాప్చర్‌ చేయనున్నారట. అదే నిజమైతే తారక్‌, చెర్రీ అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగనే చెప్పాలి.