ఉత్కంఠ లేపుతున్న #RRR కథ.. బ్రిటిష్ కాలం నాటి కథతో జక్కన రెడీ..

254

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్ర #RRR కు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి.నవంబర్ నుంచి #RRR ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాలు ఉన్నాయి.. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నాడు.

Image result for #RRR

‘బాహుబలి’ సిరీస్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తి చేసిన రాజమౌళి తరవాత ప్రాజెక్టుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు టాలీవుడ్‌లో ఇద్దరు అగ్రహీరోలుగా ఉన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.ఈ సినిమా వచ్చే నెల 5న లాంఛనంగా మొదలవుతుంది.

తొలి షెడ్యూల్ అక్కడే

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క విషయం కూడా బయటపడలేదు.సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 1920 నాటి పరిస్థితులు ఈ చిత్రంలో కనిపిస్తాయట. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ వారి ఇమేజ్ కు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్, రాంచరణ్ కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించినట్లు తెలుస్తోంది.