బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కనున్న #RRR

413

బాహుబలి విజయం తరువాత దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో వున్న రాజమౌళి ఈ చిత్రాన్ని ఇద్దరు బాక్సర్ ల కథ అని అప్పట్లో రూమర్ వచ్చింది.

అయితే రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా కథ అలాంటిది కాదని మరొక కథను రాజమౌళి సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.#RRR సినిమాను 1980 కాలం నాటి కథ నేపథ్యంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 1947 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో రాజమౌళి సర్వం సిద్ధం చేస్తున్నాడంటా.

స్వాతంత్య్ర సమరకాలంలో జరిగిన కొన్ని ఘట్టాల్ని కూడా ఈ చిత్రంలో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. రాజమౌళి మార్కు భారీ సెట్‌లు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం వుందని చిత్ర వర్గాల సమాచారం.ఈ చిత్రం ద్వారా భాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసి మరొక రికార్డ్ ను క్రియేట్ చెయ్యాలని జక్కన్న ఆలోచనలో ఉన్నాడంటా.