లక్షల కోట్లు దోచుకుంటే హీరోలా నిజాయితీగా ఉండే పవన్ ను విలన్ గా చూడటం సిగ్గుచేటు.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్

268

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం రంజుగా సాగుతోంది. పవన్ కల్యాణ్ సైతం తనదైన శైలిలో చంద్రబాబు, జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కియా మోటార్స్ ప్రధాని నరేంద్ర మోదీ వల్లే వచ్చిదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు తనదైన శైలిలో తిప్పికొట్టారు. వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు వైఎస్ విజయలక్ష్మీ, షర్మిళలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వమంటూ ప్రచారంలో జనాలకు విన్నవిస్తున్నారు.

Image result for rajamouli

మరోవైపు, ఆదివారం ఏపీలో ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు రానున్నారు. అలాగే జనసేనకు సపోర్ట్ గా మాయావతి వస్తున్నారు. అయితే ఎన్నికల అప్పుడు తప్పా మిగతా సమయంలో కనిపించని సినీ స్టార్స్ కూడా ఈసారి ప్రచారానికి వచ్చారు. చాలా మంది సినీ సెలెబ్రిటీలు తమకు నచ్చిన నాయకుడికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. పోయిన ఎన్నికల సమయంలో చంద్రబాబుకు సపోర్ట్ చేసిన సినీ సెలెబ్రిటీలు ఈసారి ఎక్కువగా జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు. కొందరు టిడిపి వైపే ఉన్నా కానీ చాలా మంది జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు. జనసేన మాత్రం సీని సెలెబ్రిటీలను వాడుకోవాలని చూడటం లేదు. పవన్ ఒక్క పిలుపు ఇస్తే చాలు వచ్చి ప్రచారం చెయ్యడానికి చాలా మంది సినీ సెలెబ్రిటీలు ఉన్నారు కానీ పవన్ వాటిని వాదాలనుకోవడం లేదు. పవన్ పిలిస్తే చాలు మెగా హీరోలు మెగా ఫామిలీ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పవన్ అంగీకరించడం లేదు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడటం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎన్నికలలో ఓటును వెస్ట్ చేసుకోవద్దు. మీకు నచ్చిన నాయకుడికి ఓటు వెయ్యండి అని చెబుతున్నాడు. రాజమౌళి మాట్లాడుతూ.. అవినీతితో కురుకుపోయినవారికి ఓట్లు వేస్తారో లేక జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఓట్లు వేస్తారో లేదా అవినీతి అంటే తెలియని, సమాజానికి మంచి తప్పా చెడు చెయ్యని వాడికి ఓటు వేస్తారో మీ ఇష్టం అని అన్నాడు.లక్షల కోట్లు దోచుకున్న వాడిని నమ్మొద్దు నిజాయితీగా ఉండేవాడిని నమ్మండి అని రాజమౌళి అన్నాడు. రాజమౌళి మాటలు విన్న వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇంత డైరెక్ట్ గా పవన్ కు ఓటు వెయ్యమని రాజమౌళి చెప్పడం ఏమిటి అని అనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా పవన్ కు తన సపోర్ట్ ఉందని రాజమౌళి చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తే అర్థం అవుతుంది.చూడాలి మరి రాజమౌళి మాటలు జనాలకు ఏమాత్రం ఎక్కుతాయో. మరి ఏపీ ఎన్నికల గురించి ఎవరికీ ఓటు వేస్తె ఏపీ అభివృద్ధి జరుగుతుందో అలాగే రాజమౌళి చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.