సడన్ గా రాజమౌళి కొడుక్కి పెళ్లి.. వధువు ఎవరి కూతురో తెలిస్తే షాక్! |

434

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొన్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆయన వివాహం ప్రముఖ నిర్మాత, దర్శకుడు దివంగత ‘జగపతి’ రాజేంద్రప్రసాద్ కుమారుడు రాంప్రసాద్ కుమార్తెతో జ‌రుగ‌నుంది..రాజమౌళి ఆ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నారు. ఈ ఏడాది చివర్లోనే కార్తికేయ వివాహం జరుగనుంది.

Image result for rajamouli son engagement

రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తే పూజా ప్రసాద్ గాయని. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు.. కార్తీకేయ, పూజా ప్రసాద్ గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఇటీవల ఒప్పించారట‌.. దీనికి ఇరు కుటుంబాలు ఒకే చెప్ప‌డంతో వీరి పెళ్లి జ‌రిపించాల‌ని రెండు కుటుంబాలు నిశ్చ‌యించారు..

Image result for rajamouli son engagement

బాహుబలి చిత్రీకరణలో యూనిట్ డైరెక్టర్‌గా కార్తికేయ రాజమౌళికి తోడ్పాటునందించాడు. పూజతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని కార్తికేయ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అవును పూజతో నూతన జీవితం ప్రారంభించడానికి ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నానంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు.కార్తికేయ, పూజా నిశ్చితార్తం బుధవారం సాయంత్రం వీబీ రాజేంద్ర ప్రసాద్ నివాసంలో జరిగింది. ప్రైవేట్ వ్యవహారంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో అఖిల్ అక్కినేని, శోభు యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ఏడాది చివర్లో వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహ తేదిని త్వరలోనే నిర్ణయించనున్నట్టు తెలిసింది..కార్తీకేయ తండ్రి రాజమౌళి బాటలోనే అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే దర్శకుడిగా రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ బ్యానర్ రూపొందించే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇక పూజాతండ్రి ప్ర‌సాద్ కూడా వ్యాపార రంగంలో ఉన్నారు త‌మ్ముడు సినిమాల్లో ఉంటే ఆయ‌న వ్యాపారాల‌తో బిజీగా ఉంటారు… సినిమా రంగానికి దూరంగా ఉన్న త‌న తండ్రి వ‌చ్చిన రంగం త‌మ్ముడు ఉన్నా రంగం కాబ‌ట్టి ఆయ‌ను సినీ ప్ర‌ముఖుల‌తో ఎంతో ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఇలా రాజ‌మౌళి కుటుంబం జ‌గ‌ప‌తి కుటుంబం ఒక‌ట‌వ్వ‌నున్నాయి. చూశారుగా వీరిద్ద‌రికి మీ కామెంట్ల ద్వారా కంగ్రాట్స్ తెలియ‌చేయండి.