Breaking News : ప్రముఖ నిర్మాత మృతి.. శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ…

302

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు హఠత్మరణం చెందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఓ వైపు యువ నటులు ఆత్మహత్యలు మరో వైపు సీనియర్ నటులు, దర్శక, నిర్మాతల మరణం చిత్ర పరిశ్రమని టెన్సన్ పెడుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు దీక్షితులు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా వుంటే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, క్లాసిక్ చిత్రాల నిర్మాతగా పేరొందిన రాజ్ కుమార్ బార్జాత్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

Image result for సూరజ్ బర్జాత్య

రాజశ్రీ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ కుమార్ బార్జత్యా కుటుంబ కథా చిత్రాలని బాలీవుడ్ లో ఎక్కువగా నిర్మించి తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ అంటే బాలీవుడ్ లో రాజశ్రీ ప్రొడక్షన్, రాజ్ కుమార్, అతని కుమారుడు సూరజ్ బర్జత్య అందరికి గుర్తుకొస్తారు.బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య ఈయన కుమారుడే. ఈయన దర్శకత్వంలోనే వచ్చిన ‘‘మైనే ప్యార్ కియా’’ తో సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.ఈ సినిమాలో సల్మాన్..ప్రేమ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా ఓ రేంజ్‌లో హిట్టైయింది.ఆ తర్వాత వీరి బ్యానర్ రాజశ్రీలో వచ్చిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’, ‘ హమ్ సాథ్ సాథ్ హై’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి సినిమాలు తెరకెక్కాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

ప్రస్తుతం సూరజ్ బర్జాత్య..సల్మాన్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజశ్రీ ప్రొడక్షన్ బాద్యతలని రాజ్ కుమార్ బార్జాత్యా కుమారుడు సూరజ్ బార్జాత్యా చూసుకుంటూ వున్నారు. ఇదిలా వుంగే కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన ఆయన ఈ రోజు మరణించినట్లు తెలుస్తుంది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయనకి నివాళి అర్పించి, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.