రాహుల్, పునర్నవిలకు పెళ్లి చేస్తాం.. వాళ్ల ఇష్టమే మా ఇష్టం : రాహుల్ పేరెంట్స్

52

బిగ్ బాస్ సీజన్ 3 అయిపోయింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేత అయ్యాడు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించడంలో పునర్నవి పాత్ర కీలకమే. ఎపిసోడ్ ప్రారంభం నుండి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో పున్నూ, రాహుల్‌లను లవర్స్‌ని చేసేశారు నాగార్జున. సమయం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న భావన ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఈ ఇద్దరి మధ్య బంధాన్ని లవ్ ట్రాక్‌గా మలిచారు. ఇది టీఆర్పీ రేటింగ్‌లో భాగమే అయినా.. పున్నూ-రాహుల్‌లు కూడా లవ్, డేటింగ్, రొమాన్స్ అంటూ కథను బాగానే రక్తికట్టించారు. పునర్నవి హౌస్‌లో ఉన్నన్నాళ్లు ఓ సోమరిగా.. ఆమెతో తిట్లు తింటూ.. పున్నూ కోసం మాత్రమే ఈ పులిహోర రాజా అని ముద్రవేసుకున్న రాహుల్.. పునర్నవి ఎలిమినేషన్ తరువాత రెండు రోజుల పాటు కుమిలి కుమిలి ఏడుస్తూ తరువాత గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే పునర్నవి ఎలిమినేషన్ తరువాతనే రాహుల్‌లోని ఆటగాడు బయటకు వచ్చాడు. అంతకు ముందు బత్తాయి, బ్రెడ్ అంటూ పునర్నవి వెనుక తిరగడం.. ఆమె తన బీభత్సమైన యాటట్యూట్‌ని చూపించడం.. వీకెండ్‌లో ఈ ఇద్దర్నీ హైలైట్ చేస్తూ నాగార్జున ఎపిసోడ్‌ను నడిపించడం జరిగేవి.

Image result for rahul and punnu

ఇక పున్నూ కోసం రాహుల్ చేసిన త్యాగాలు.. వాటికి కృతజ్ఞ‌తగా పున్నూ పాత కౌగిలింతలు, కిస్‌లకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్, పునర్నవిల మధ్య రొమాన్స్ బిగ్ బాస్ హౌస్‌లో వేరే రేంజ్‌ కావడంతో ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ ఎక్కేశారని నాగార్జునతో పాటు ప్రేక్షకులుకూడా డిసైడ్ అయిపోయారు. పాపం పునర్నవి వాడి వదిలేసిన పిన్నీసులు, లబ్బరు బ్యాండ్, కవర్‌లు దాచుకుని వాటితోనే బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ కాలం గడిపేశాడంటే ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం ఎంత బలమైనదో ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ఈ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చేందుకు పెద్దలు కూడా రెడీ అయ్యారు. అవునండీ.. పునర్నవి, రాహుల్‌లు ఓకే అంటే పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్లను చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు రాహుల్ పేరెంట్స్. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించిన తరువాత పున్నూకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాహుల్. ఈ సందర్భంగా రాహుల్ పేరెంట్స్ వీరి పెళ్లిపై ఓపెన్ అయ్యారు.

ఈ క్రింద వీడియో చూడండి

బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగిందన్నది వాళ్లకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్లు నిజంగా లవ్ చేసుకుని ఉంటే మేం కాదనం. వాళ్లు లోపల లవ్ చేసుకున్నారేమో బయట ఉన్న మాకు తెలియదు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందనే భావన జనంలో కలిగించారు బిగ్ బాస్ వాళ్లు. అయితే అది వాళ్ల టీఆర్పీ రేటింగ్ గురించి అయినా ఉండొచ్చు. వాళ్లు లవ్ చేసుకుంటుంటే.. వాళ్ల ఇష్టమే మా ఇష్టం. ఫైనల్‌గా వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం. తప్పకుండా పెళ్లి చేస్తాం. అయితే వాళ్ల మధ్య అయితే లవ్ ఉందనేది బిగ్ బాస్ హౌస్ వరకే అనుకుంటున్నాం. మాకైతే తెలియదు. వాళ్లతో పాటు ఉన్న మిగిలిన వాళ్లకు తెలుస్తుంది. మాకైతే వాళ్లకు పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ కుండబద్దలు కొట్టేశారు రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్. చూడాలి మరి ఈ ఇద్దరు తమ మధ్య ఉన్నది ప్రేమనా లేక ఫ్రెండ్ షిప్ అని అంటారో.. ఏది ఏమైనా ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ ఫాన్స్ పునర్నవితో పెళ్లి అయితే రాహుల్ జీవితాంతం బాగుంటాడని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..

ఈ క్రింద వీడియో చూడండి