సేవా గుణానికి ప్రతిఫలంగా మదర్ థెరిసా అవార్డ్ దక్కించుకున్న రాఘవ లారెన్స్

301

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలు పెట్టి నటుడిగా తన సత్తా చాటడంతో పాటు దర్శకుడిగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్న రాఘవ లారెన్స్ సేవా గుణంలోనూ తాను ఏ మాత్రం తీసిపోనని ప్రూవ్ చేసుకున్నారు. సేవా గుణంలో తన పెద్ద మనసు చాటుకున్నారు.తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాఘవ లారెన్స్ కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 150 కి పైగా చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. అనాధ పిల్లలకు తన శక్తిమేర సహాయం అందిస్తున్నారు.

Image result for raghava lawrence seva trust

ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో రూ. కోటి విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు.మదర్‌ ధెరిసా 108వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలోని మదర్‌ థెరిసా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఉత్తమ సేవలను అందించిన వారిని మదర్‌ థెరిసా అవార్డుతో సత్కరిస్తారు. అందులో భాగంగా పలు సామాజిక సేవలను నిర్వహిస్తున్న నటుడు రాఘవ లారెన్స్‌ను మదర్‌ థెరిసా అవార్డుతో సత్కరించింది.

ఈ అవార్డు ప్రధానోత్సవ వేడుక గురువారం సాయంత్రం చెన్నై, తేరనాపేటలోని కామరాజర్‌ ఆవరణలో జరిగింది.ఈ విషయాన్ని లారెన్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డు అందుకోవడాన్ని గొప్పగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.