పూరి రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం ప్రారంభం

201

చాలా రోజుల నుంచి దర్శకుడు పూరి జగన్నాథ్ కు సరైన హిట్ లేదు. దాంతో అతనితో ఎవరు సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ఇన్నిరోజులు హీరో రామ్ ముందు వచ్చాడు. పూజి జగన్నాథ్ తనసొంత నిర్మాణ సంస్థలో రామ్ హీరోగా సినిమా ప్రారంభించాడు.. ఈ చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.

Image result for ismart shankar

ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నటి ఛార్మీ క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించగా స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే ప్రారంభం కానుంది. ‘ఇస్మార్ట్ శంకర్’యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కనుంది.ఓ వైవిధ్యమైన కథతో సినిమాను రూపొందిస్తున్నాడు.

Related image

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజీ, ఆశిష్ విద్యార్థి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ న్యూ లుక్‌లో కనిపించబోతున్నాడు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రామ్.. సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో కనిపించాడు.