పూరి ఆకాష్ రెండవ సినిమాను మొదలెట్టాడు..హీరోయిన్ ఎవరో చూడండి

345

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఒకప్పుడు ఎంతో మంది యువ హీరోకు లైఫ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగు వెలుగుతున్న వారితో పలు చిత్రాలు చేసి మంచి విజయాలను దక్కించుకున్నాడు. ఇంతటి సూపర్‌ హిట్‌ దర్శకుడు అయిన పూరి జగన్నాద్‌ తన కొడుకుకు మాత్రం సక్సెస్‌ను తెచ్చి పెట్టడంలో విఫలం అయ్యాడు.

Image result for puri jagannath with son

పూరి తనయుడు ఆకాష్‌ చిన్నప్పటి నుండే సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆకాష్‌ ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం కనీసం వారం రోజులు కూడా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.

Akash Puri Next Movie Updates - Sakshi

ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట.తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాష్ సరసన గాయత్రి భరద్వాజ్‌ అనే మోడల్‌ను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.