Breaking News : ప్రముఖ నిర్మాత నారా జయశ్రీ దేవి మృతి.. శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ..

307

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విజ‌య బాపినీడు మృతితో షాక్‌లో ఉన్న టాలీవుడ్‌కి మ‌రో దెబ్బ త‌గిలింది. ప్రముఖ మహిళా సినీ ప్రొడ్యూసర్ నారా జయశ్రీ దేవి కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయశ్రీ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు.ఇటీవల జయశ్రీకి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలల పాటు శిక్షను విధించింది. 2005లో అశ్విని పిక్చర్స్ ఓనర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆనంద్ నుంచి రూ.17.40 లక్షలను ఆమె అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగిచ్చే సమయంలో ఆమె ఆనంద్‌కు చెక్ ఇచ్చారు. అది కాస్తా బౌన్స్ అవడంతో కోర్టు ఆమెకు 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. ఆ శిక్ష అనంతరం ఆమె సినిమాలేమి తీయలేదు.

Producer Jayashree Devi Passed Away - Sakshi

హిట్‌ చిత్రాలు శ్రీ మంజునాథ‌, చంద్ర‌వాసం, వందేమాతరం, జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర వంటి చిత్రాల‌ను ఆమె నిర్మించారు.కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్, హీరో కుమార్ గోవింద్ కలిసి నటించిన కోన ఇదైతే చిత్రంతో నిర్మాతగా, దర్శకురాలిగా కన్నడ సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు. భవానీ అనే చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు పక్కన పెట్టి పూర్తి స్థాయి నిర్మాతగా మారిపోయారు. కన్నడ, తెలుగు రంగాల్లో కలిపి మొత్తం 20 చిత్రాలను నిర్మించారు. జయశ్రీ నిర్మించిన చివరి చిత్రం ముకుందా మురారీ. ఈ చిత్రంలో కిచ్చ సుదీప్, ఉపేంద్ర కలిసి నటించారు. కన్నడలో మంచి విజయాన్ని అందుకొన్నది. ఇది తెలుగులో వచ్చిన గోపాలగోపాలా సినిమాకు రీమేక్. కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నిర్మాతగా జయశ్రీ అద్భుతమైన చిత్రాలను అందించారు. పలు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. నమ్మూరా మందారా హువే, అమృత వర్షిణి, స్నేహలోకం, హబ్బా, శ్రీ మంజునాథ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకొన్నారు. శ్రీ మంజు నాథలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి జయశ్రీ భౌతిక కాయాన్ని బెంగళూరుకు తరలించనున్నారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిపించే అవకాశం ఉంది. సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఫిలిం చాంబర్‌లో పార్ధీవ దేహాన్ని ఉంచుతాం. అంత్యక్రియల వివరాలను మీడియాకు తెలియజేస్తాం అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఆమె మృతికి సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆమె మృతికి నివాళి అర్పిద్దాం.