ఢీలో తన భర్త గురించి దారుణమైన విషయాలు చెప్పి ఏడ్చేసిన ప్రియమణి

1028

బుల్లితెర‌లో ఎంటర్టైన్ మెంట్ జాన‌ర్ లో బాగా చెప్పుకునేది, టీఆర్పీలో టాప్ ఉండేది జ‌బ‌ర్ద‌స్త్ అనే చెప్పాలి.. అలాంటి షో త‌ర్వాత అంతే పేరు ఉన్న షో ఢీ.. ఇక ఈ షో కూడా ఇప్ప‌టికే ఎంతో ప్రాముఖ్య‌త సంపాదించుకుంది.. ముఖ్యంగా జ‌బ‌ర్ద‌స్త్ మార్కెట్ పెరిగిన త‌ర్వాత కొద్ది రోజులు దానిని బీట్ అవుట్ చేసిన షోగా కూడా ఢీ పేరు సంపాదించింది.. వాస్త‌వంగా ఏ షో అయినా టెలివిజ‌న్ లో టీఆర్పీ వ్యూవ‌ర్స్ ఎక్కువ ఉండాలి ..అప్పుడే స‌క్సెస్ అవుతాయి అలాంటి షోలు ఎక్కువ పేరు గ‌డిస్తాయి. ఇక ఢీ సీజ‌న్ సీజ‌న్ కు స‌రికొత్త‌గా వ‌స్తోంది. ఇది టెలివిజ‌న్ మార్కెట్ ను మ‌రింత పెంచింది అని చెప్పాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

Image result for priyamani husband images

ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఢీ ప్రొగ్రాంకు అంత‌టి పాపులారిటీ ఉంది… 11 సంవత్స‌రాల నుంచి ప్ర‌సార‌మ‌వుతున్న ఈ ప్రొగ్రాంకు విప‌రీమైన రేటింగ్స్ వ‌స్తున్నాయి.గ‌త రెండు సంవ‌త్స‌రాలు నుంచి ఢీకి జ‌డ్జీగా హీరోయిన్ ప్రియ‌మ‌ణి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.ఎప్పుడు హుషారుగా ఉండే ప్రియ‌మ‌ణి తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఏడ్చేసింది.దీనికి కార‌ణం ఆమె భ‌ర్త ముస్తాఫా రాజ్‌.నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఓ జంట హిందు ,ముస్లింకు సంబంధించిన పాట‌కు డ్యాన్స్ వేశారు. ఈ డ్యాన్స్ చూసిన ప్రియ‌మ‌ణి చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు.ప్రియ‌మ‌ణి ముస్తాఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ప్రియ‌మ‌ణి పెళ్లి చేసుకున్న స‌మ‌యంలో ఆమెపై చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఓ హిందువు అయి ఉండి ముస్లింను ఎలా పెళ్లి చేసుకుంటావు అని ప్రియ‌మ‌ణిని ట్రోల్ చేశారు నెటిజ‌న్లు.రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా జిహాదిలుగా మార‌తార‌ని చాలా ఘోరంగా కామెంట్స్ చేశారు.త‌న పెళ్లి స‌మ‌యంలో చేసిన కామెంట్స్‌ను గుర్తుకు తెచ్చుకుని క‌న్నీరు పెట్టుకుంది ప్రియ‌మ‌ణి.హిందు,ముస్లిం అందరు స‌మాన‌మ‌ని ,అలా వేరు చూసి చూడ‌వ‌ద్ద‌ని చెప్పింది ప్రియ‌మ‌ణి.త‌న భ‌ర్త ముస్తాఫా రాజ్‌తో చాలా ఆనందంగా ఉన్నాన‌ని తెలిపింది.ప్రియ‌మ‌ణి ఎమోష‌న్స్ అవ్వ‌డం చూసి యాంక‌ర్స్‌ ర‌ష్మీ,సుధీర్‌లు కూడా క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇలా విమ‌ర్శిస్తారా అని ఆమె ఆవేద‌న చెందింది ఓ కులం వారు ఇలా మ‌రోకులం వారు ఇలా అనే హ‌క్కు ఎవ‌రికి లేదు.. మ‌నిషిని చూడాలి వారిలో మాన‌వ‌త్వం చూడాలి అని అంటున్నారు షో చూసిన వారు మ‌రి చూశారుగా ఆమె చెప్పిన మాట‌ల‌పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.