#RRR లో ఛాన్స్ దక్కించుకున్న ప్రియమణి..

279

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది.

Image result for #RRR

బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. రాజమౌళి సినిమాల్లో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది.అయితే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇతర తారాగణం ఎవరు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. హీరోయిన్ల ఎంపిక కూడా జరుగాల్సి ఉంది.విలన్ పాత్రలో కన్నడ హీరో యశ్ పేరు వినిపిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం రాజమౌళి పెద్ద స్టార్స్ ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర కోసం రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు పరిశీలిస్తున్నాడట.

Image result for priyamani images

తాజాగా అందుతున్న సమాచారం ప్రియమణి కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో గతంలో ప్రియమణి ‘యమదొంగ’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.