ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

1047

తెలుగు సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ దిగ్గజ నటుడు. ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను అలరింపజేశాయి. ఆయన ఐదు తరాల నటులతో పనిచేశారు. ఎన్నో చిత్రాలలో హీరోగా నటించారు. ఆయన పక్కన తొలిసారి నటించిన హీరోయిన్లు సూపర్ స్టార్లు అయ్యారు. వారిలో జయసుధ, విజయశాంతి లాంటి హీరోయిన్లు ఉన్నారు.హీరోగా అవకాశాలు తగ్గాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎంతోమంది హీరో హీరోయిన్స్ కు తండ్రిగా నటించాడు.ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ గెలుచుకున్నాడు. తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగిన ఆయన పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందొ మీకు తెలుసా..ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

Image result for chandra mohan

సినిమా నటులు సంపాదించినా డబ్బు మరింత పెరగాలని సినిమా నిర్మాతగా మారి సినిమా తీయడం లేదా వేరే బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టడం లాంటివి ఎక్కువగా చేస్తారు.అలా సినిమాలు తీసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించినవారు కొందరు అయితే నష్టపోయి పూర్తీ ఆస్తులు పోగొట్టుకుని తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కూడా లేనివారు కొందరు ఉన్నారు. ఒకప్పటి సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా ఇప్పుడు అదే జీవితాన్ని గడుపుతున్నాడంట.సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొంది చాలా డబ్బును సంపాదించాడు చంద్రమోహన్.అయితే అతని భార్య కొన్ని రోజుల క్రితం కొన్ని బోగస్ కంపెనీలను ఏర్పరచి చివరికి వాటిని దివాళా సంస్థలుగా మార్చిందని ఆయన కుటుంబం మీద అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ కేసు నుంచి త్వరగానే బయటపడిన చంద్రమోహన్ కుటుంబం ఆ తర్వాత మిగిలిన డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టడం జరిగింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే మొదట్లో బాగానే నడిచిన వ్యాపారాలు కొన్ని రోజుల క్రితం దివాళా తీశాయని తెలుస్తుంది. దాంతో ఆయన పూర్తీగా నష్టపోయాడనే చాలా అప్పులలో కూరుకుపోయాడని,ఆ అప్పులు తీర్చడానికి ఆయన ఆస్తులు కూడా సరిపోలేదని దాంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని తెలుస్తుంది.అసలే డయాబెటిస్ మరియు బిపి ఉన్న చంద్రమోహన్ ఈ భాదతో మంచం పెట్టాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కుటుంబం తినడానికి తిండికూడా లేని పరిస్థితి ఎదుర్కొంటుందని తెలిసింది.నిన్నమొన్న వరకు అడపాదడపా సినిమాలలో నటించిన చంద్రమోహన్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దారుణం. ఆయన పరిస్థితి తెలుసుకున్న కొందరు సినీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్లి సహాయం అందిస్తున్నారని సమాచారం. ఆయన కోలుకొని మళ్ళి ఆర్థికంగా స్థిరపడి తన నటనతో మళ్ళి మనల్ని అలరించాలని కోరుకుందాం. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చంద్రమోహన్ గురించి అలాగే ప్రస్తుతం ఆయన దయనీయ పరిస్థితి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.