సిద్దమైన ‘ప్రేమకథా చిత్రమ్2 ’సినిమా… హీరోయిన్ ఎవరంటే!

413

హారర్ అండ్ లవ్ కాన్సెప్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ‘ప్రేమకథా చిత్రమ్’ మూవీకి సీక్వెల్ వస్తుంది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. 2013 మే 11న విడుదలైన ఈ సినిమా చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించింది.

తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా‘ప్రేమకథా చిత్రమ్ 2’ టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అయ్యారు.ఈ చిత్రానికి ‘బ్యాక్ టూ ఫియర్’ అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్’తో చిత్రంలో నటించిన సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

‘ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా’ చిత్రంతో మంచి క్రేజ్ హీరోయిన్‌గా పేరు సంపాదించిన నందితా శ్వేత ఈచిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది.అలానే మ‌రో హీరోయిన్ గా సిధ్ధి ఇదాని చేస్తుంది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.