పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్, అందరూ షాక్.. ఇంట్లో చివాట్లు

1920

పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే.కొందరు ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటే కొందరు ప్రేమ పెళ్లి చేసుకుంటారు.ఎవరు ఎలా చేసుకున్నా చివరికైతే అందరికి పెళ్లి అవుతుంది.విదేశాల గురించి పక్కన పెట్టి మన దేశం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పెళ్లి విషయంలో మనకు కొన్ని పద్ధతులు సంప్రదాయాలు ఉన్నాయి.ముఖ్యంగా పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి ఒకరిని ఒకరు కలవడం కానీ కలిసుండటం కానీ చెయ్యకూడదు.అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఫారెన్ కంట్రీస్ లలో పాటిస్తున్న పద్దతులను మనవాళ్ళు పాటించడం మొదలుపెట్టారు.పెళ్ళికి ముందు డేటింగ్ అనే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.నచ్చితే పెళ్లి లేకుంటే లేదు.అయితే కొందరు డేటింగ్ పద్దతిలో ఒక అడుగు ముందుకు వేస్తారు.అలా అడుగు వెయ్యడం వలన గర్భం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇలాంటి పరిస్థితే ఒక హీరోయిన్ కు వచ్చింది.పెళ్ళికి ముందే గర్భం దాల్చింది.మరి ఆ హీరోయిన్ ఎవరు వారి కథ ఏమిటో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for నేహా దూపియా

బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా, నటుడు అంగద్ బేడీతో పెళ్లికి ముందు నుంచే మంచి స్నేహితులు. వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ ఏడాది మే 10న రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. పెళ్లికి ముందే నేహా దూపియా గర్భం దాల్చిందని, విషయం బయటకు పొక్కితే పరువు పోతుందనే ఇలా హడావుడిగా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఆగస్టులో నేహా-అంగద్ త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం బయట పెట్టారు. ‘నోపిల్టర్ నేహా’ అనే షోలో అంగద్ బేడీ అసలు విషయం బయట పెట్టారు. పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చిన అంశంపై స్పందించారు. ఇది నిజమే…ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో మాకు చివాట్లు పెట్టారని తెలిపారు. మేము ప్రేమలో ఉన్న విషయం తెలుసు కానీ పెళ్లికి ముందే మా నుంచి ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని వారు ఊహించి ఉండరు. ఆ సందర్భంలో వారికి కోపం రావడం సహజమే అని అంగద్ బేడీ వ్యాఖ్యానించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయం గురించి నేహా దూపియా సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టులు పోగొట్టుకోవడం ఇష్టం లేకనే తాను గర్భం దాల్చిన విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ విషయం వారికి తెలిసి ఉంటే నాపై వారి అభిప్రాయాలు మారిపోతాయి. నాకు ఆఫర్స్ ఇవ్వడం మానేస్తారు, అందుకే ఎవరికీ తెలియనివ్వలేదని చెప్పింది.. నేహా దూపియా షోలో అంగద్ బేడీ మాట్లాడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇలా పెళ్ళికి ముందు గర్భం దాల్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.కొందరు పెళ్లి చేసుకుంటే కొందరేమో సినిమా అవకాశాలు తగ్గిపోతాయని ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించుకున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నేహాదూపియా గురించి అలాగే పెళ్ళికి ముందే గర్భం దాల్చడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.