పాత రోజుల్ని గుర్తుకు చేసుకుంటూ మహేష్‌బాబుకు ప్రీతీజింటా ట్వీట్!

430

సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రీతి జింటా వీరిద్దరి పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చే చిత్రం రాజకుమారుడు.మహేష్‌బాబు హీరోగా పరిచయమైన చిత్రం ఇదే.అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.కృష్ణ వారసుడిగా ఎలా మెప్పిస్తాడో అనుకున్న అభిమానులకు ఈ సినిమా ద్వారా సరైన వారసుడు వచ్చాడనుకున్నారు.

ఈ సినిమా విడుదలై దాదాపు 19 ఏళ్లు కావస్తోంది. ప్రీతీ జింటా ఈ విషయాన్ని మహేష్‌బాబుతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. రాజకుమారుడు సినిమా విడుదలై అప్పుడే 19 ఏళ్లు అవుతోంది. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. మహేష్‌బాబుతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు నేర్చుకోవడం కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపా. ధన్యవాదాలు రాఘవేంద్రరావుగారు’’ అని తెలిపింది.

అనంతరం మహేష్‌బాబుతో షూటింగ్ సమయంలో తీసుకున్న అప్పటి ఫొటోను షేర్ చేసుకుంది. ఇందులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు సూపర్ స్టార్ కృష్ట, మహేష్‌బాబు, నిర్మాత అశ్వనీదత్, ప్రీతీజింతా ఉన్నారు.