బిగ్ బాస్ సాక్షిగా తన కాబోయే భార్య గురించి ప్రకటించిన యాంకర్ ప్రదీప్…

750

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 40 ఫుల్ జోష్‌తో ప్రారంభమైంది.ఈ ఎపిసోడ్‌లో యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉండటంతో ప్రేక్షకుల ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ప్రదీప్ ఎప్పుడెప్పుడెప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారా అని ఎదురుచూస్తున్న సందర్భంలో లగేజ్‌తో సహా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్. వచ్చీ రావడంతోటే తనదైన శైలి టైమింగ్ పంచ్‌లతో బిగ్ బాస్ హౌస్‌లో చెడుగుడు ఆడేశాడు. పంచ్‌ల ప్రవాహంతో బిగ్ బాస్ హౌస్‌ హోరెత్తించాడు. గ్యాప్ లేకుండా టైమింగ్ డైలాగ్‌లతో బిగ్ బాస్ హౌస్‌కి ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు.అయితే ప్రదీప్ ఈ హౌస్ ద్వారానే తనకు కాబోయే భార్యను ప్రకటించాడు.మరీ ప్రదీప్ కు కాబోయే ఎవరో ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for anchor pradeep in bigg boss

బుల్లితెర మీద రాణిస్తున్న యాంకర్ ప్రదీప్ ను అందరు అడిగే ప్రశ్న నీ పెళ్ళెప్పుడు అని.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు ప్రదీప్.గురువారం నాడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియజేస్తూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.‘పెళ్లి చూపులు’ అనే టెలివిజన్ షో ప్రమోషన్‌లో భాగంగా అక్కడకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఇది కేవలం షో మాత్రమే కాదని తన లైఫ్ పార్టనర్‌ అన్వేషణ కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు ప్రదీప్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా బిగ్గెస్ట్ ఫ్యాన్ తన లైఫ్ పార్టనర్‌గా రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు ప్రదీప్.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ప్రదీప్.

Image result for anchor pradeep in bigg boss

ఈ ప్రోమోలో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురు కావడం దానికి ప్రదీప్ స్పందిస్తూ.. ‘ఇలా అడుగుతూనే ఉంటారు నేను ఏదో జోక్ చెప్పి తప్పించుకోవడం ఇది రోజూ జరిగేదే. కాఫీ షేర్ చేసుకోవడం కాదురా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఒక్కరికైనా నచ్చుతావ్ గా అని అంటారండీ.. ఇదిగో ఇలా పెళ్లికి వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ నువ్వే.. నెక్స్ట్ నువ్వే అంటున్నారండీ..
అందుకే అడక్కుండానే అన్నీ ఇచ్చిన టీవీ నాకొక భాగస్వామిని ఇస్తుందేమో రండి ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం’ అంటూ ప్రదీప్ పెళ్లి చూపులకు ఆహ్వానిస్తున్నారు.

మరి మన ప్రదీప్ ఎదురుచూస్తున్న అమ్మాయి మీరే అని అనిపిస్తే.. http://pellichoopulu.startv.com/ లో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ‘పెళ్లి చూపులు’ ప్రమోషన్ ప్రోమోను వదిలారు. ఈ ‘పెళ్లి చూపులు’ కార్యక్రమం బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిన తరువాత ప్రారంభం కానుంది.మొత్తానికి ప్రదీప్ రాకతో గురువారం నాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.మరీ ప్రదీప్ పెళ్లి కోసం తలపెట్టిన ఈ స్వయంవరం లాంటి పెళ్ళిచూపులు పోగ్రాం మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.