హైదరాబాద్‌ నా పుట్టిల్లు…. ప్రభుదేవా

354

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘లక్ష్మి’. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో ‘సూపర్ డాన్సర్ సీజన్ 1’ విజేత బేబీ దిత్య నటిగా పరిచయమవుతోంది.

Related image

డాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో దిత్య నృత్య గురువుగా ప్రభుదేవా కనిపించనున్నారు. ఈనెల 24న తెలుగు ప్రేక్షకుల ముందకు ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు.సీఎస్‌ శ్యామ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్, దర్శకులు క్రిష్, వి.వి.వినాయక్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆడియోను దర్శకుడు వి.వి.వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు.

Image result for prabhu deva lakshmi movie release date

ఈ సందర్భంగా హీరో ప్రభుదేవా మాట్లాడుతూ.. ఆడియో విడుదల కార్యక్రమాన్ని పెద్ద వేడుకలా చేస్తున్న నిర్మాత కళ్యాణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ‘హైదరాబాద్‌కి వస్తే నాకేదో పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది డాన్స్ సినిమా అనేకంటే ఎమోషనల్ ఫిల్మ్ అంటే మంచిది. విజయ్‌కి ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. దిత్య సూపర్ డాన్సర్. ఆమెతో డాన్స్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఏదో మేనేజ్ చేశాను. కానీ తను మాత్రం చాలా బాగా చేసింది’ అని ప్రభుదేవా అన్నారు.