కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ.. కాంబినేషన్ సెట్ చేసిన యువీ క్రియేషన్?

254

సౌత్ ఇండియా మొత్తం ఇప్పుడు కెజిఎఫ్ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా ఇది. హీరో యష్ ను మరొకస్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది.

 కేజీఎఫ్‌తో భారీ సక్సెస్

అయితే కేజీఎఫ్ విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న ప్రశాంత్‌ నీల్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్. ఇప్పుడు దక్షిణాదిలోని ప్రముఖ సినీ నిర్మాతలందరూ ప్రశాంత్‌ ను కలుస్తున్నారు.

Image result for prabhas with prashanth neel

అయితే తాజాగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు యూవీ క్రియేషన్ ఒప్పందం కుదుర్చుకొన్నారనే వార్త వైరల్‌గా మారింది. ఆయనతో మాస్ అంశాలు ఉన్న సినిమాను డైరెక్ట్ చేయించే పనిలో యూవీ క్రియేషన్ ఉందని సమాచారం. ఆ సినిమా కథ ప్రభాస్ కు కూడా నచ్చిందని సమాచారం. అంటే త్వరలోనే మరో నేషనల్ స్థాయి సినిమాలో మన డార్లింగ్ కనిపించబోతున్నాడన్న మాట.