ఆ సినిమా కోసం బరువు తగ్గనున్న ప్రభాస్

356

బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్‌గా మారిపోయాడు.అందుకే తన తరువాత సినిమాలు ‘బాహుబలి’ రేంజ్‌కి తగ్గకుండా చూసుకుంటున్నాడు.ప్రస్తుతం సాహో చేస్తున్నాడు.హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు.బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరిగాడు ప్రభాస్.

సంబంధిత చిత్రం

ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహో మూవీ కోసం ఈ బరువును కంటిన్యూ చేస్తున్నాడు.అయితే తన తర్వాతి సినిమా ఒక లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉండబోతుందంట.‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాను గురువారం నాడు లాంచ్ చేయనుంది చిత్రబృందం. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ 10 కేజీల బరువు తగ్గనున్నాడని సమాచారం.

సంబంధిత చిత్రం

రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో ప్రభాస్ కాస్త స్లిమ్‌గా కనిపించాల్సి ఉంటుంది. దీంతో ఈ స్టార్ హీరో బరువు తగ్గేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తోంది చిత్రబృందం.