ప్రభాస్ పెళ్లి ఫిక్స్..చివరకు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు

1433

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది.. రెబల్ స్టార్ ప్రభాస్ పేరే.. పెదనాన్న నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తనదైన శైలి నటనతో రాణిస్తున్నాడు. దేశం గర్వించదగిన సినిమా ‘బాహుబలి’లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత తాను పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ వెల్లడించాడు. దాంతో పెళ్లి కూతురు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉందని కొన్ని రోజులు, వైజాగ్ అమ్మాయని కొన్ని రోజులు ఇలా వార్తలు హల్చల్ చేశాయి. గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇద్దరు స్టార్స్ ఖండించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంతకు మించి మరే రిలేషన్ లేదని స్పష్టం చేశారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ప్రభాస్ పెళ్ళి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు..అతని పెళ్ళి అవిషయంలో అనేక రూమర్స్ వచ్చాయి.. అయితే అందులో ఎలాంటి నిజాలు లేవు.. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా ఈ బాహుబలికి తగిన జోడీని వెతికే పనిలో బిజీగా ఉన్నారు.. ప్రభాస్ పెళ్ళి గురించి రూమర్స్ కు తెరదించాలని వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ప్రభాస్ పెళ్లి వార్త గురించి అతి త్వరలోనే ఆయన పెదనాన్న కృష్ణం రాజు చెప్పబోతున్నారు. ప్రభాస్ పెళ్ళి వార్త అతి త్వరలోనే ఉందని ఈ విషయం గురించి తాజాగా అభిమానులకు తెలిపే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.. అయితే ఇదే ఇప్పుడు నిజమవబోతోంది.. సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి జరగబోతుంది.

Image result for prabhas

సాహో సినిమా రిలీజ్‌ తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్‌ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్‌ పెళ్లాడనున్నాడని తెలుస్తోంది. అమ్మాయి అమెరికాలో ఎంబిఏ చేసినట్టు సమాచారం.. గుంటూరుకు చెందిన ఈ అమ్మాయినే పెళ్ళి చేసుకోవచ్చనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.. అయితే ఈ వార్తలపై ప్రభాస్‌ గాని ఆయన పీఆర్‌ టీం గాని ఇంతవరకు స్పందించలేదు. ఇదే నిజం అయితే ఫాన్స్ కి ఇంతకంటే పెద్ద శుభవార్త ఏముంటుంది చెప్పండి. మరి ప్రభాస్ పెళ్లి మీద వచ్చిన ఈ వార్త గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.