సాహో కలెక్షన్ల సునామీ.. టోట‌ల్ సాహో కలెక్ష‌న్లు ఇవే

169

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి టాక్ ఎలా ఉన్న వసూళ్ల పరంగా దూసుకెళుతోంది. రిలీజైన తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను సంపాదించుకొన్న ఈ చిత్రం తొలి వారాంతంలో భారీగా కలెక్షన్లు సాధించి రికార్డులను నెలకొల్పింది. తొలి వారాంతం తర్వాత హిందీ వెర్షన్ మినహాయిస్తే.. మిగితా భాషల్లో కలెక్షన్లు దారుణంగా త‌గ్గాయి. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాహో చిత్రం వాటిని ఎదిరించుకొంటూ రూ.500 క్లబ్‌వైపు పరుగులు పెడుతోంది. గత 12 రోజుల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్ గా ప్రేక్ష‌కుల‌తో నిండిపోయింది.

Image result for sahoo

గతంలో ‘బాహుబలి’ సిరీస్‌తో వరల్డ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి, బాక్సాఫీస్ షేక్ చేసిన ప్ర‌భాష్ .. ఇప్పుడూ అందరిచేత ‘సాహో’ అనిపించుకుంటున్నాడు వ‌సూళ్ల ప‌రంగా . ఎవ‌రూ ఊహించ‌ని స్ధాయిలో సాహో కలెక్షన్ల సునామీ స్తుష్టిస్తూ పరుగులు పెడుతోంది. ఇటీవలే 400 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా తన హవా కొనసాగిస్తూనే ఉంది. అతి తక్కువ అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ చిత్రం అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తూ ఓ రేంజ్ బిజినెస్ చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ‘సాహో’ సంచలనంగా మారింది. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2 వారాల్లో సాహో మూవీ 424 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో’ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. టైగర్ ష్రాఫ్, మందిరా బేడీ సహా పలు భాషల్లోని భారీ తారాగణం ఈ సినిమాలో న‌టించారు.

Image result for sahoo

ఇక సాహో 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరుతుంది అని అంద‌రూ అనుకున్నారు.. అయితే మ‌రో మూడు రోజులు ఇలా ట్రెండ్ కొన‌సాగితే క‌చ్చితంగా రీచ్ అవుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు, కాని ఇప్పుడు గ్యాంగ్ లీడ‌ర్ అలాగే రాబోయే వాల్మీకి చిత్రాలు సాహో పై ఎఫెక్ట్ చూపిస్తాయి అంటున్నారు, అందుకే సాహో మ‌రో ప‌ది రోజులు ఇలాగే ప్ర‌ద‌రిస్తే క‌చ్చితంగా 500 కోట్ల క్ల‌బ్ లో చేరుతుంది అనేది అభిమానులు చెప్పేమాట‌. మ‌రి చూడాలి వ‌సూళ్ల మార్క్ ఎక్క‌డికి చేరుతుందో.