స్వాతంత్రం రోజునే ‘సాహో’ రిలీజ్‌ …

253

‘బాహుబలి’ అఖండ విజయంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కోసం యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో అందరిని ఆకట్టుకుంది..హాలివుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ సమక్షంలో సన్నివేశాలు చిత్రీకరించారు. ‘షేడ్స్ ఆఫ్ సాహో’ చాప్టర్ 1 పేరుతో విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో అభిమానులను అబ్బురపరచింది..హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి యాక్షన్ సీన్స్.

Related image

స్టైలిష్ లుక్‌తో కళ్లద్దాలు పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ స్టైల్ చూస్తే వహ్వా అని అనిపిస్తుంది.ఈ చిత్రంలో హీరయిన్‌గా నటిస్తున్న శ్రద్ధా కపూర్ కూడా యాక్షన్ సీన్స్ చేసినట్లు మేకింగ్ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమా కోసం ఆమె చిత్రీకరణకు ముందే స్టంట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు.సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌. ఎవలిన్‌ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Image result for saaho release date

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.