‘సాహో’లో ప్ర‌భాస్ పాత్ర ఏంటో రివీల్ అయ్యింది..

449

బాహుబలి ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో.బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దకాపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. యు.వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోంది.

Image result for saaho

ఇందులో ఉండే యాక్ష‌న్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయ‌ట‌.ఇప్పటివరకు ఈ చిత్రం గురించి లీక్ అయిన ఫోటోలు ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.అయితే ఎవరెవరి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఇంతవరకు తెలియదు.అయితే ఇప్పుడు ప్ర‌భాస్ పాత్ర గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ అంతర్జాతీయ వజ్రాల దొంగగా నటిస్తున్నారని ఆయన కోసం ఇంటర్ పోల్ అధికారులు తీవ్రంగా గాలిస్తుంటారని తెలిసింది.

Image result for saaho

ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలైట్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి.వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌ధ‌మార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.మ‌రి బాహుబలిగా ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న ఈ సాహో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.