పెద్ద ప్రాజెక్ట్ ను రిజ‌క్ట్ చేసిన ప్ర‌భాస్

401

టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ బాహుబ‌లితో అఖండ‌ఖ్యాతి సంపాదించాడు.. ఇప్పుడు ఆయ‌న సాహోతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ప్ర‌భాస్ గురించి ఓ వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది..ఆయ‌న బాలీవుడ్ లో ప‌ద్మావ‌త్ సినిమాలో లీడ్ రోల్ లో న‌టించే అవ‌కాశం వ‌స్తే వ‌దులుకున్నారట‌.సంజయ్ లీలా భన్సాలి మాగ్నమ్ ఓపస్ చిత్రంలో ప్రభాస్‌కి రాజా రావల్ సింగ్ పాత్రను పోషించే అవకాశం వచ్చిందట. కానీ ఆయన దాన్ని వదులుకోవడంతో ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషించాల్సి వచ్చింది అని తెలుస్తోంది.

Image result for prabhas

ప్రభాస్‌కి ఈ ఆఫర్ వచ్చినపుడు రాణి పద్మావతి పాత్రకు ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నారట. అయినా ఆ సినిమాను ప్రభాస్ తిరస్కరించాడని తెలుస్తోంది. పద్మావత్ సినిమాలో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.. కానీ వారిద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌ని కూడా పంచుకోకపోవడం విశేషం… త‌న రేంజ్ కు త‌గ్గ‌ట్టు ఆ పాత్ర‌లేక‌పోవ‌డంతో ఆ సినిమాని వ‌ద్ద‌ని ప్ర‌భాస్ చెప్పార‌ట‌.. 2018లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. అంతేకాకుండా నార్త్ అమెరికాలో ప్రభాస్ బాహుబలి కలెక్షన్స్‌ను బీట్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా.