మెగా ఫంక్ష‌న్ కు మ‌రోసారి ప్ర‌భాస్ నిహారిక హ్యాపీ

474

టాలీవుడ్ లో మెగా డాట‌ర్ నిహారిక కూడా త‌న సినిమాల‌తో దూసుకుపోతోంది… నీహారిక – సుమంత్ అశ్విన్ ఈ జంట వెండితెర‌పై న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేందుకు సిద్ద‌మయ్యారు.. ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ఫార్ములా అయిన పెళ్లి కథతో హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేస్తున్నారు.

Image result for niharika

ఇక ఈ సినిమాపై ఇప్ప‌టికే ఎన్నో ఆశ‌లుపెట్టుకుంది చిత్ర యూనిట్, అలాగే సినిమా పై అనేక ఆశ‌లు కూడా పెట్టుకుంది నిహారిక..ఇక హ్యాపీ వెడ్డింగ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది…..ఈ సినిమా ట్రయిలర్ పై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమాకి హైప్ తీసుకురావాలి అని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. అందుకే ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది..ఈనెల 21న హైదరాబాద్ లోనే ఈ ఈవెంట్ జరగనుంది.

Image result for prabhas

ఇక ఈ సినిమాకు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నార‌ట.. ఇక మెగా హీరోలు అంద‌రి ఫంక్ష‌న్లకు వ‌చ్చి మెగా సెల‌బ్రేష‌న్స్ చేస్తున్న చిరంజీవి, నాగ‌బాబు కుమార్తె సినీ ఫంక్ష‌న్ కు త‌ప్ప‌క వ‌స్తారు అని అంటున్నారు…మరోవైపు హీరో సుమంత్ అశ్విన్ కోసం ప్ర‌భాస్ ఈ ఫంక్ష‌న్ కు రానున్నారు అని తెలుస్తోంది.హ్యాపీ వెడ్డింగ్ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇది హీరో ప్రభాస్ కు సొంత సంస్థలాంటిదే. అలాగే ప్ర‌భాస్ కు ఇప్ప‌టికే యూవీ క్రియేష‌న్స్ లో ఉన్న త‌న మిత్రులు తెలియ‌చేశార‌ట.. ఈ సినిమా ఫంక్ష‌న్ కు రావాలి అని… ఇదే చిత్ర‌యూనిట్ కూడా కోరుకుంటోంది.. నిజంగా ఇద్ద‌రూ గెస్ట్ లుగా వ‌స్తే ఈ సినిమాకి మంచి హైప్ రావ‌డం షురూ..