ప్రభాస్‌ కొత్త సినిమా లుక్‌ అదుర్స్..

224

బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియన్ స్టార్ అయిపోయాడు.ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ప్రభాస్ మాత్రం తెలుగు సినెమాలకే పచ్చజెండా ఊపుతున్నాడు.బాహుబలి తరువాత సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఆ సినిమా రిలీజ్‌ కాకముందే మరో సినిమాను ప్రారంభించాడు.

Related image

జిల్‌ సినిమా ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్‌ స్టోరిలో నటిస్తున్నాడు.ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి గోపికృష్ణ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఎక్కువ భాగం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 చివర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది.

Prabhas New Moive Look Revealed - Sakshi

తాజాగా హీరో ప్రభాస్‌ కూడా ఇటలీలో యూనిట్‌తో జాయిన్‌ అయ్యారు.తాజా లోకేషన్‌లో ప్రభాస్ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అక్కడి స్థానిక అధికారులతో కలిసి ఉన్న ఫొటోలో ప్రభాస్‌ డిఫరెంట్‌ లుక్‌లో విభిన్న కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నాడు.ప్రభాస్ కొత్త లుక్ చుసిన అభిమానులు అయితే ఆనందంలో మునిగితేలుతున్నారు.